: పవన్ కల్యాణ్ పై జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు
నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ మౌనం వీడి, సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై ఆయన స్పందించారు. కాగా, పవన్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని అంటున్నారు తెలంగాణ న్యాయవాదులు. ఈ మేరకు వారు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేందుకు పవన్ ప్రయత్నించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు తగవని అన్నారు.