: ఆయన వ్యాఖ్యలపై మాట్లాడితే నా స్థాయే దిగజారుతుంది: హరీష్ రావు


జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలపై స్పందిస్తే తన స్థాయిని దిగజార్చుకోవడమే అవుతుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. పవన్ మాటలపై పూర్తి స్థాయిలో స్పందించేందుకు మంత్రి నిరాసక్తత వ్యక్తం చేశారు. పవన్ నిన్న మాట్లాడిన మాటల్లో అవగాహన లేదని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వాళ్లను, ప్రోత్సహించిన వాళ్లను పవన్ వెనకేసుకొచ్చారని మెదక్ జిల్లా పర్యటనలో హరీష్ విమర్శించారు.

  • Loading...

More Telugu News