: కన్నీరు పెట్టిన బెజవాడ కమిషనర్ వెంకటేశ్వరరావు
విజయవాడతో తాను పెంచుకున్న అనుబంధాన్ని వీడి వెళ్లే వేళ, భావోద్వేగానికి లోనైన విజయవాడ పోలీసు కమిషనర్ వెంకటేశ్వరరావు కొంతసేపు కన్నీరు పెట్టారు. తనకు ఇంటెలిజన్స్ చీఫ్ గా బదిలీ అయిన తరువాత, తాను దత్తత తీసుకున్న వీఎం రంగా బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులతో ఆయన భేటీ అయ్యారు. విజయవాడతో ఉన్న అనుబంధం శాశ్వతం చేసుకునే దిశగా ఆయన ఇప్పటికే ఈ పాఠశాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీచర్లు మాట్లాడుతూ, స్కూలుకు ఆయన చేసిన సేవలను వివరిస్తుండగా, తన ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. పలుమార్లు కళ్లు తుడుచుకున్నారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ, తాను బదిలీపై వెళ్లినా పోలీసు శాఖ ఆగదని, అది ఓ నది వంటిదని, తామంతా పడవల వంటి వారమని తెలిపారు. మహేష్ బాబు పోలీసు పాత్ర పోషించిన ఓ చిత్రంలోని డైలాగు చెప్పి పిల్లలను నవ్వించారు.