: బాబా అటామిక్ రీసర్చ్ సెంటర్ వద్ద కలకలం


ముంబైలోని బాబా అటామిక్ రీసర్చ్ సెంటర్ (బార్క్) వద్ద ఓ డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. బార్క్ సమీపంలో ఓ డ్రోన్ ఎగురుతుండటాన్ని గుర్తించిన ఓ ప్రొఫెసర్, దాన్ని వీడియో తీసి, స్థానిక పోలీసులకు అందించాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు, ఓ రియలెస్టేట్ వెబ్ సైట్ కు చెందిన వారు డ్రోన్ ను ఆపరేట్ చేసినట్టు గుర్తించారు. సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. పరిశోధన కేంద్రం భద్రతపై భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కొన్నేళ్లుగా బార్క్ ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉంది. బార్క్ లో అత్యంత అధునాతనమైన ప్రయోగశాలల్లో న్యూక్లియర్ పరిశోధనలు జరుగుతుంటాయి. దీంతో, ఇక్కడ ఏదైనా జరిగితే, ఊహించని విధ్వంసం జరిగే ప్రమాదం ఉంది.

  • Loading...

More Telugu News