: ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు హైకోర్టులో ఊరట


తెలంగాణలోని 25 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు హైకోర్టులో ఊరట లభించింది. జేఎన్ టీయూహెచ్ అనుమతించని కళాశాలలను రేపటి నుంచి జరిగే కౌన్సెలింగ్ కు అనుమతించాలని ఆదేశించింది. ఈ మేరకు జేఎన్ టీయూహెచ్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సరైన సౌకర్యాలు, అనుమతులులేని కారణాలతో తమను కౌన్సెలింగ్ అనుమతించడం కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. సదరు కళాశాలల్లో మరోసారి తనిఖీలు నిర్వహించి తమకు నివేదిక సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది.

  • Loading...

More Telugu News