: ధోనీకి వెల్లువెత్తిన శుభాకాంక్షలు
టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ ధోనీ పుట్టిన రోజు నేడు. ఈ రోజుతో ధోనీ 35వ ఏట అడుగుపెట్టాడు. తన పుట్టిన రోజు సందర్భంగా ధోనీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బర్త్ డే బాయ్ కి ఐసీసీ, బీసీసీఐతో పాటు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఐసీసీ, బీసీసీఐలు 'హ్యాపీ బర్త్ డే' అంటూ ట్వీట్ చేశాయి. సురేష్ రైనా, రహానే, ఓఝా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. పాక్ మాజీ కెప్టెన్, ఇండియన్ టెన్నిస్ తార సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కూడా ధోనీకి గ్రీటింగ్స్ తెలిపాడు.