: పలు దేశాలు ఉలిక్కిపడి తెలుగువాడిని చూసే సందర్భం వస్తోంది: అల్లు అరవింద్


'బాహుబలి' చిత్రాన్ని ఎంతో కష్టపడి నిర్మించారని, ఎవరూ పైరసీకి పాల్పడరాదని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆ సినిమాను అత్యంత వ్యయప్రయాసల కోర్చి రెండున్నరేళ్లు కష్టపడి నిర్మించారని, ప్రతి తెలుగువాడు సగర్వంగా చెప్పుకోదగిన చిత్రం అవుతుందని అన్నారు. యావత్ భారతదేశమే కాకుండా, ప్రపంచంలోని పలు దేశాలు ఉలిక్కిపడి తెలుగువాడిని చూసే సందర్భం ఈ నెల 10వ తారీఖున వస్తోందని తెలిపారు. దయచేసి ఈ సినిమాను ఎవరూ పైరసీ చేయరాదని, పైరసీ సమాచారం తెలిస్తే మానిటరింగ్ సెల్ కు ఫోన్ చేయాలని సూచించారు. పైరసీని ప్రోత్సహిస్తే థియేటర్లపై ఏడాది నిషేధం తప్పదని హెచ్చరించారు. ఏ థియేటర్ నుంచి పైరసీ చేశారన్న విషయం తమకు తెలిసిపోతుందని అన్నారు.

  • Loading...

More Telugu News