: సండ్రకు 14 రోజుల రిమాండ్... బెయిల్, కస్టడీ పిటిషన్లపై రేపు విచారణ


ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఏసీబీ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దీంతో, కాసేపట్లో సండ్రను చర్లపల్లి జైలుకు తరలించనున్నారు. ఈ నెల 21 వరకు సండ్ర రిమాండ్ కొనసాగుతుంది. ఎమ్మెల్యే కావడం వల్ల సండ్రకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. మరోవైపు, సండ్రను విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ చేసిన వినతికి... కౌంటర్ దాఖలు చేయాలని సండ్ర తరపు లాయర్లకు కోర్టు సూచించింది. దీంతో, సండ్ర తరపు లాయర్లు కౌంటర్ దాఖలు చేశారు. మరోవైపు, బెయిల్ కోసం సండ్ర తరఫు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో, బెయిల్, కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు రేపు విచారించనుంది.

  • Loading...

More Telugu News