: రాహుల్ వెళ్లాడు, 'హౌసింగ్ డాట్ కాం' హ్యాక్ అయింది!


రాహుల్ యాదవ్... ఆన్ లైన్ రియాల్టీ స్టార్టప్ సంస్థ 'హౌసింగ్ డాట్ కాం' మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆయన సంస్థను వీడిన వారం రోజుల్లోపే 'హౌసింగ్ డాట్ కాం' వెబ్ సైట్ హ్యాక్ అయింది. ఈ హ్యాకింగ్ వెనుక వెబ్ సైట్ గురించిన సర్వస్వం తెలిసిన రాహుల్ హస్తం ఉందని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 'ఒక కంపెనీ నుంచి తొలగిస్తే ఏం చేయాలి? ఆ సంస్థ వెబ్ సైట్ ను హ్యాక్ చేయాలి' అని ఒకరు, 'ఇతనికి నిజాయతీ అన్నదే లేదు. మరెవరూ ఉద్యోగాలు ఇవ్వకూడదు. ఎంత జోకర్ పనిచేశాడు!' అని ఇంకొకరు, 'వెబ్ సైట్ ను నిర్వహించేవారికన్నా హ్యాకర్లు శక్తిమంతులని రాహుల్ మరోసారి నిరూపించాడు' అని మరొకరు... ఇలా తమతమ ట్వీట్లతో రాహుల్ పై విరుచుకుపడుతున్నారు. అయితే, రాహుల్ మాత్రం తనకు, హ్యాకింగ్ కు సంబంధం లేదని తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లో పోస్టింగును ఉంచడం గమనార్హం.

  • Loading...

More Telugu News