: పవన్ వ్యాఖ్యలపై ఈ సాయంత్రం 5.00కు ఎంపీ కేశినేని నాని కౌంటర్!
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ఎంపీలపై చేసిన వ్యాఖ్యలపై ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ కౌంటర్ ఇవ్వనున్నారు. ఇందుకోసం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో వివాదాలు రేపిన ఓటుకు నోటు కేసు, టెలిఫోన్ ట్యాపింగ్ అంశాలపై నిన్న(సోమవారం) పవన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమయంలోనే ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన పవన్, ఈ విషయంపై పార్లమెంటులో మాట్లాడకుండా ఏపీ ఎంపీలు ఏం చేస్తున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేగాక సీమాంధ్ర ఎంపీలకు రోషం లేదా? అని కూడా ప్రశ్నించారు. ఇందుకు స్పందనగానే నాని మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా నానిపై కూడా పవన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.