: ఆసుపత్రిలో ఉన్న భూమాను పరామర్శించిన జగన్
నంద్యాల వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని ఆ పార్టీ అధినేత జగన్ పరామర్శించారు. కర్నూలులోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగిరెడ్డిని కలసి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు జగన్. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో, పోలీసులతో వాగ్వాదానికి దిగిన భూమాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భూమాను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సాయంత్రం 4 గంటలకు జగన్ కర్నూలు నుంచి బయల్దేరి కడప వెళ్తారు.