: మరో గంటలో సండ్ర అరెస్ట్ కరెక్టా? కాదా? తేలుస్తామన్న కోర్టు... విచారణ మధ్యాహ్నం 1.30కి వాయిదా


ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగాయి. సండ్ర అరెస్ట్ అక్రమమని ఆయన తరపు న్యాయవాది వాదించారు. మొదట సీఆర్ పీసీ 160 కింద విచారణకు పిలిపించారని, ఆ తర్వాత 41ఏ కింద నోటీసులిచ్చి అరెస్ట్ చేశారని తెలిపారు. దీనికి తోడు సండ్ర అరెస్ట్ కు సంబంధించి శాసనసభ స్పీకర్ కు కాని, ఎన్నికల సంఘానికి కాని సమాచారం ఇవ్వలేదని చెప్పారు. మరోవైపు, కేసు కీలక దశలో ఉన్నప్పుడు సండ్ర రాజమండ్రికి వెళ్లారని ఏసీబీ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సండ్ర అరెస్ట్ సక్రమమే అని వాదించారు. ఈ క్రమంలో, ఇరువైపు వాదనలు విన్న ఏసీబీ కోర్టు... మరో గంటలో సండ్ర అరెస్ట్ సక్రమమా? కాదా? అన్న విషయాన్ని వెల్లడిస్తామని తెలిపింది. విచారణను మధ్యాహ్నం 1.30 గంటలకు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News