: గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలి: సీపీఐ నారాయణ
గవర్నర్ వ్యవస్థపై సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నరు వ్యవస్థ ఉత్సవ విగ్రహాల్లాగా మారిందని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నారాయణ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో నెలకొంటున్న సమస్యలకు కేంద్రమే బాధ్యత వహించాలని, నిర్ణయం తీసుకుంటే వివాదాలు క్షణాల్లో తొలగిపోతాయని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తుందిగానీ, పేదల అవసరాలకు మాత్రం డబ్బులు లేవంటోందని ఆయన ఆరోపించారు. భక్తి పేరుతో భారీ అవినీతి జరుగుతోందని నారాయణ అన్నారు.