: నాపై తప్పుడు కేసులు పెట్టారు... ఏసీబీ కోర్టు వద్ద ‘సండ్ర’ వ్యాఖ్య


ఓటుకు నోటు కేసులో అరెస్టైన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఏసీబీ కోర్టు ప్రాంగణంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఉదయం నుంచి రాత్రి దాకా పలు కోణాల్లో సండ్రను విచారించిన ఏసీబీ, రాత్రి తమ కార్యాలయంలోనే ఉంచుకుంది. నేటి ఉదయం ఉస్మానియాలో వైద్య పరీక్షలు పూర్తి చేయించిన ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కోర్టులోకి వెళ్లే ముందు తనను పలకరించిన మీడియాతో సండ్ర మాట్లాడారు. ఏసీబీ అధికారులు తనపై తప్పుడు కేసులు బనాయించారని వెంకటవీరయ్య ఆరోపించారు. విచారణలో భాగంగా తనకు తెలిసిన అన్ని విషయాలను ఏసీబీ అధికారులకు తెలిపానని ఆయన చెప్పారు. కేవలం ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా కేసులెలా నమోదు చేస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన తప్పుడు కేసులపై కోర్టులో న్యాయపోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News