: విచారణలో ‘సండ్ర’ నోరిప్పలేదు...ఐదు రోజుల కస్టడీకివ్వండి: కోర్టులో ఏసీబీ పిటీషన్


ఓటుకు నోటు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కొద్దిసేపటి క్రితం ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. నిన్న ఉదయం నుంచి సండ్రను విచారించిన ఏసీబీ అధికారులు రాత్రి తమ అదుపులోనే ఉంచుకుని కొద్దిసేపటి క్రితం కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సండ్రను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. నిన్న ఉదయం నుంచి జరిగిన విచారణలో భాగంగా సండ్ర ఏమాత్రం నోరు విప్పలేదని చెప్పిన ఏసీబీ, కేసులో ఆయనే కీలక నిందితుడని ఆరోపించింది. కేసులోని కీలక చిక్కుముడులు విప్పాలంటే సండ్రను పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తమ పిటీషన్ లో కోర్టుకు విన్నవించారు.

  • Loading...

More Telugu News