: ఇక తిరుమలలో వై-ఫై... పుష్కరాల్లో తాత్కాలిక సేవలు
బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్)తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తిరుమలలో పూర్తి స్థాయి వై-ఫై సేవలను అందించనున్నామని క్వాడ్జన్ వ్యవస్థాపక చైర్మన్ సీఎస్ రావు వెల్లడించారు. నిన్న ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో 5-జీ టెక్నాలజీ ఆధారిత వై-ఫై సదుపాయాన్ని దగ్గర చేయనున్నామని అన్నారు. రాజమండ్రి పుష్కరాల భక్తులకు మరింత సౌకర్యాన్ని అందించేలా తాత్కాలిక వై-ఫై సేవలు అందిస్తున్నామని, మొత్తం ఎనిమిది చోట్ల హాట్ స్పాట్ లను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. రెండు రోజుల్లో పనులు పూర్తవుతాయని తెలిపారు. తిరుమల కొండపై వై-ఫై సేవల కోసం ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.