: ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీగా మాగుంట విజయం... మరికాసేపట్లో కర్నూలు ఫలితం
ఏపీలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా ఫలితం కొద్దిసేపటి క్రితం వెల్లడైంది. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి విజయం సాధించారు. 711 ఓట్ల భారీ ఆధిక్యంతో ఆయన విజయం సాధించినట్లు కొద్దిసేపటి క్రితం అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే, కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక్కడ అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.