: కర్నూలు, ఒంగోలులో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం...మధ్యాహ్నంలోగా రిజల్ట్స్
ఏపీలో ‘స్ధానిక’ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో మెజారిటీ సీట్లను అధికార టీడీపీ ఏకగ్రీవంగానే దక్కించుకోగా... ప్రకాశం, కర్నూలు జిల్లాలో ప్రతిపక్ష వైసీపీతో ఆ పార్టీ ప్రత్యక్ష బరిలోకి దిగాల్సి వచ్చింది. తదనంతర పరిణామాల్లో ప్రకాశం జిల్లా ఎన్నికలను వైసీపీ బహిష్కరించగా, కర్నూలు స్థానానికి జరిగిన ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగింది. ఒంగోలు, కర్నూలుల్లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన కౌంటింగ్ నేటి మధ్యాహ్నం 12 గంటల్లోగా పూర్తి కానుంది. కర్నూలు జిల్లా స్థానం ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.