: ఉస్మానియా ఆస్పత్రికి సండ్ర తరలింపు...మరికాసేపట్లో కోర్టుకు!
ఓటుకు నోటు కేసులో నిన్న అరెస్టైన టీడీపీ నేత, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను తెలంగాణ ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న ఉదయం విచారణకు హాజరైన సండ్రను రాత్రిదాకా ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. కోర్టు సమయం ముగిసిన తర్వాత సండ్రను అరెస్ట్ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.