: అమరావతిలో మిజుహో బ్యాంకు శాఖ...సంసిద్ధత ప్రకటించిన జపాన్ ప్రాచీన బ్యాంకు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి జపాన్ ప్రాచీన బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన మిజుహో బ్యాంకు రానుంది. ఈ మేరకు జపాన్ లో పర్యటిస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయిన ఆ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో బ్యాంకు శాఖను ప్రారంభించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. జపాన్ లో అత్యంత ప్రాచీనమైన బ్యాంకుగానే కాక ఆ దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగానూ మిజుహో పేరుగాంచింది. అమరావతిలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై బ్యాంకు ప్రతినిధులు ఆసక్తి కనబరిచారని చంద్రబాబు పేర్కొన్నారు.