: సండ్ర అరెస్టును ప్రకటించని ఏసీబీ...బెయిల్ పిటీషన్ కు సిద్ధంగా ఉన్నామన్న లాయర్
టీడీపీ నేత, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అరెస్ట్ ను ఇప్పటిదాకా ఏసీబీ అధికారికంగా ప్రకటించనేలేదట. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆయన తరఫు న్యాయవాది ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. రాత్రి 11 గంటల దాకా సండ్ర అరెస్ట్ పై ఏసీబీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదని ఆయన ఆరోపించారు. సండ్ర అరెస్ట్ ను ఏసీబీ ప్రకటించిన వెంటనే కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అసలు రాత్రంతా సండ్రను ఏసీబీ అధికారులు తమ అదుపులో ఎలా ఉంచుకుంటారని కూడా న్యాయవాది ప్రశ్నించారు.