: ఏపీ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం కల్పించండి... రాష్ట్రపతికి భద్రాచలం ఎమ్మెల్యే వినతి!


కాస్త విడ్డూరంగా ఉన్నా, ఖమ్మం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య నిన్న రాష్ట్రపతిని ఇదే డిమాండ్ చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాచలం నియోజకవర్గంలోని ఏడు మండలాలు ఏపీ పరిధిలోనూ విస్తరించి ఉన్న నేపథ్యంలో తనకు ఏపీ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ముంపు మండలాల పేరిట ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపిన విషయం తెలిసిందే. సదరు మండలాలు ఏపీలో కలిసినా, వాటి ప్రజలకు తెలంగాణలో ఓట్లున్నాయి. అంతేకాక ఇటీవల జరిగిన తెలంగాణ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆ మండలాల ప్రజలు కీలకంగా మారారు. ఇక ఈ ఏడు మండలాల ప్రజల సమస్యలపై స్పందించడానికి ప్రజా ప్రతినిధి దాదాపుగా ఎవరూ లేరనే చెప్పాలి. ఇక అధికారుల తీరు సరేసరి. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ముఖర్జీతో తన పార్టీ నేతలతో కలిసి భేటీ అయిన సున్నం రాజయ్య, తనకు ఏపీ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.

  • Loading...

More Telugu News