: 500 మందికిపైగా బాలికలకు ఆడిషన్ నిర్వహించాక... 'హర్షాలి'ని ఎంపిక చేశారు!


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన 'భజరంగి భాయిజాన్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ నటించారు. వారితో పాటు, హర్షాలి మల్హోత్రా అనే బాలిక కీలక పాత్రలో నటించింది. ఆ చిన్నారి ఈ సినిమాలో 'మున్ని' పాత్ర పోషించింది. ఇప్పుడు బాలీవుడ్ లో హర్షాలి టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలుస్తోంది. సల్మాన్, కరీనా వంటి స్టార్లు ఉన్న సినిమాలో అద్భుతమైన అభినయం కనబర్చిందంటూ చిత్ర యూనిట్ కొనియాడుతోంది. మున్ని పాత్ర పోషించే అమ్మాయి కోసం 500 మందికి పైగా బాలికలకు ఆడిషన్ నిర్వహించాక, హర్షాలి కనిపించడంతో దర్శకుడు కబీర్ ఖాన్ ఎగిరి గంతేసినంత పనిచేశాడట. తన అన్వేషణకు అంతటితో స్వస్తి చెప్పి హర్షాలిని ఖాయం చేసేశాడు.

  • Loading...

More Telugu News