: లలిత్ మోదీకి సమన్లు జారీ చేసిన ఈడీ
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 'మోదీ గేట్' పేరిట లలిత్ మోదీ దేశంలోని అన్ని పార్టీల రాజకీయ నాయకులను లక్ష్యం చేసుకుని రోజుకో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. లండన్ లో ఉంటూ మోదీ భారత రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నారు. నిన్న భారత రాష్ట్రపతిపై ఆరోపణలు చేశారు. దీంతో, అతనిపై చర్యలకు ఉపక్రమించిన అధికారులు, అతనిని స్వదేశానికి రప్పించడంపై నిపుణులను సంప్రదించారు. అతని అరెస్టు కోసం మల్లగుల్లాలుపడ్డ నిపుణులు ఎట్టకేలకు ఈడీ సమన్లు పంపారు. దీనిపై లలిత్ మోదీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.