: ఢిల్లీపై గ్రీస్ తరహా రెఫరెండమ్ నిర్వహించాలి: కేజ్రీవాల్


ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించడంపై గ్రీస్ తరహా రెఫరెండమ్ నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ పట్టణాభివృద్ధి విభాగానికి లేఖ రాశారు. గ్రీస్ తరహాలో ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలా? వద్దా? అని ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీపై కచ్చితంగా ప్రజాప్రాయ సేకరణ జరపాలని ఆప్ నేత ఆశిష్ ఖైతాన్ డిమాండ్ చేశారు. కాగా, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రాలకు సంక్రమించే అన్ని అధికారాలు ఢిల్లీకి ఉండవు. కేంద్రం పరిథిలో పరిపాలన సాగాలి. దీంతో ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది.

  • Loading...

More Telugu News