: ధోనీ వ్యాఖ్యలను పాజిటివ్ గా తీసుకున్నా: రహానే


భారత వన్డే క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన ముంబయి యువ కిశోరం అజింక్యా రహానే మీడియాతో మాట్లాడాడు. తన ఆటతీరుపై ధోనీ చేసిన వ్యాఖ్యలను తాను పాజిటివ్ గా స్వీకరించినట్టు తెలిపాడు. ఇకపై ఆటతీరును మెరుగుపర్చుకునేందుకు శ్రమిస్తానని చెప్పుకొచ్చాడు. "ధోనీ భాయ్ నా ఆటతీరును విశ్లేషించాడు. దాన్ని సానుకూలంగానే తీసుకున్నాను. నా వరకు బంగ్లా టూర్ గతం. ఇకపై వన్డేల్లో మరింత నిలకడ ప్రదర్శించాలన్నదే నా లక్ష్యం" అని వివరించాడు. ఇక, జట్టులో జూనియర్లు, సీనియర్లు అన్న భావన సరికాదని రహానే అభిప్రాయపడ్డాడు. జట్టులోని 15 మంది ఆటగాళ్లు సమానమేనని అన్నాడు. కెప్టెన్ గా తాను అందరికీ మద్దతుగా నిలుస్తానని, అయితే, జట్టు సారథిగా తనకు సొంత వ్యూహాలున్నాయని చెప్పుకొచ్చాడు. ఇటీవల బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ లో విఫలమయ్యాక రహానేను మిగతా రెండు వన్డేలకు పక్కనబెట్టారు. దానిపై ధోనీ వివరణ ఇస్తూ... ఉపఖండం పరిస్థితులకు అనుగుణంగా స్ట్రయిక్ రొటేట్ చేయడంలో రహానే ఇబ్బంది పడుతున్నాడని వ్యాఖ్యానించాడు. అయితే, ఆశ్చర్యకరంగా జింబాబ్వే టూర్ కు ధోనీ, కోహ్లీలకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ రహానేకు జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ పరిణామం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

  • Loading...

More Telugu News