: ఎన్టీఆర్ జీవితం స్ఫూర్తి దాయకం: వెంకయ్యనాయుడు
పట్టుదల, అకుంఠిత దీక్ష, నిరంతర శ్రమతో సినీ, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థానం అధిరోహించిన దివంగత నందమూరి తారకరామారావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిలెస్ లో శ్రీకృష్ణుని రూపంలో రూపొందించిన 800 కిలోల పంచలోహ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెండితెర వేల్పుగా, విలక్షణ నటుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. అమెరికాలో వివిధ రంగాల్లో ఉన్నవారు, మాతృభూమిని, జన్మనిచ్చిన గ్రామాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు.