: ఉత్తరాఖండ్ పోలీసులకు కష్టం వచ్చిపడింది!
ఉత్తరప్రదేశ్ లో ఇటీవలే మంత్రి అజం ఖాన్ పశువులు చోరీ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించిన పోలీసులు అందులో సఫలమయ్యారు. ఊపిరి పీల్చుకునేంతలో మరో కేసు వచ్చిపడింది. అలహాబాదులో దెయ్యం ఉందంటూ పుకార్లు షికారు చెయ్యడంతో అటువైపు దృష్టి సారించారు. పొరుగు రాష్ట్రం ఉత్తరాఖండ్ లోనూ ఇలాంటి పరిస్థితే చోటుచేసుకుంది. డెహ్రాడూన్ లోని రాజ్ పూర్ జింకల పార్కులో ఈ నెల 2న దొంగలు పడ్డారు. వారు జింకల జోలికి వెళ్లకుండా ఆ పార్కులో ఉన్న ఓ గుడ్లగూబను ఎత్తుకెళ్లారు. దాంతో, పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది గుడ్లగూబ కోసం గాలింపు చేపట్టారు. పార్కు కంచెను తొలగించి లోపలికి చొరబడ్డ దొంగలు అరుదైన జాతికి చెందిన గుడ్లగూబను అపహరించారు. పార్కు నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్ఎస్పీ పుష్పక్ జ్యోతి ఈ ఘటనలో ఎస్ హెచ్ఓ స్థాయి అధికారితో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. మరి, ఉత్తరాఖండ్ పోలీసుల శ్రమ ఫలిస్తుందో, లేదో చూడాలి!