: పిట్టల్ని కొట్టబోతే రన్ వే అంటుకుంది!
విమానాలకు అడ్డం పడుతున్న పక్షులను తరిమేసేందుకు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతాధికారులు చేపట్టిన చర్యలు రన్ వేకు నిప్పుపెట్టాయి. చెన్నై విమానాశ్రయంలో పక్షుల బెడద ఎక్కువైపోతోంది. విమానాలకు అడ్డంపడుతూ ఆలస్యానికి కారణమవుతున్నాయి. దీంతో అధికారులు వాటిని తరిమేసేందుకు బాణాసంచా ఉపయోగించారు. ఈ బాణాసంచా నిప్పులు ఎగిరి రన్ వేకు సమీపంలోఉన్న బే 55 వద్దనున్న ఎండుగడ్డిపై పడ్డాయి. దీంతో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక దళం రంగప్రవేశం చేసి వాటిని ఆర్పేసింది.