: టీడీపీ ఎమ్మెల్యే సండ్ర అరెస్టు


తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఓటుకు నోటు కేసులో ఈ ఉదయం నుంచి సండ్రను ఏడు గంటలపాటు సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ చివరిగా అదుపులోకి తీసుకుంది. రేపు ఆయనను ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో ఇప్పటికి రెండుసార్లు ఏసీబీ నోటీసులు పంపిన తరువాత సండ్ర విచారణకు హాజరయ్యారు. అయితే నోటీసు పంపిన మరో వ్యక్తి జిమ్మీబాబు మాత్రం ఏసీబీ విచారణకు హాజరుకాలేదని తెలిసింది.

  • Loading...

More Telugu News