: ఆ సివిల్స్ విజేతకు సచినే ప్రేరణ!


బ్యాటింగ్ దేవుడు సచిన్ టెండూల్కర్ క్రికెటర్లకే కాదు, మిగతా ఆటలు ఆడేవారికి కూడా ఆదర్శనీయ వ్యక్తే. లోగడ ఎంతోమంది ఈ విషయం తెలిపారు కూడా. ఇప్పుడు క్రీడేతర వ్యక్తులు కూడా సచిన్ జీవితం నుంచి స్ఫూర్తి పొందుతున్నారు. తాజాగా, యూఎపీఎస్సీ పరీక్షల్లో మహారాష్ట్ర టాపర్ గా నిలిచిన అబోలీ నరవాణే ఏమంటున్నారో వినండి! తాను సచిన్ ను ప్రేరణగా తీసుకుని సివిల్స్ లో ఘనవిజయం సాధించానని గర్వంగా చెప్పారు. ఆలిండియా లెవెల్లో 78వ ర్యాంకు సాధించిన అబోలీ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ... సచిన్ జీవితచరిత్రను కనీసం ఆరుసార్లు చదివి ఉంటానని తెలిపారు. ముఖ్యంగా, మాస్టర్ లోని మూడు గుణాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆట పట్ల అంకితభావం, నేల విడిచి సాము చెయ్యని తత్వం, దేశం కోసం సర్వశక్తులు ఒడ్డడం... ఇవే తనలో ఉత్సాహం నింపాయని ఆమె వివరించారు. కాగా, ఎంఏ ఎకనామిక్స్ చదివిన ఈ మహారాష్ట్ర యువతి కథక్ లోనూ ప్రావీణ్యం సంపాదించడం విశేషం. తనకెప్పుడైనా కాలేజ్ పుస్తకాలు బోరు కొడితే, వెంటనే సచిన్ బెస్ట్ ఇన్నింగ్స్ చూస్తానని అబోలి తెలిపారు. మెరుగైన ర్యాంకుతో సివిల్స్ పాస్ కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, కల నిజమైందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News