: యాసిన్ భత్కల్ విసిరిన కాగితం కోసం పోలీసుల ఉరుకులు పరుగులు
హైదరాబాదులోని దిల్ షుక్ నగర్ పేలుళ్ల కేసు నిందితులను పోలీసులు రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా యాసిన్ భత్కల్ సహా ముగ్గురు నిందితులకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో న్యాయస్థానం నుంచి జైలుకు వ్యాన్ లో తీసుకెళ్తుండగా, భత్కల్ ఓ కాగితాన్ని దూరంగా విసిరేశాడు. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టి, ఆ కాగితాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో చర్లపల్లి జైలు నుంచి తప్పించుకునే ప్లాన్ ఉండి ఉంటుందని భావించిన పోలీసులు అవాక్కయ్యేలా...'తాను జైలు నుంచి తప్పించుకుంటానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తనను ఎన్ కౌంటర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని' ఆ కాగితంలో రాశాడు. కాగా, డమాస్కస్ నుంచి కొంత మంది మిత్రులు తనను తప్పిస్తారని చర్లపల్లి జైలు నుంచి ఫోన్ లో తన తల్లికి చెప్పినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.