: జాగ్రత్త పడండి! లేకపోతే, భారత నగర వాసుల్లా కష్టాలపాలవుతారు!: చైనా కొత్త ప్రచారం


ప్రపంచంలోకెల్లా అత్యధిక పరిమాణంలో కర్బన ఉద్గారాలు విడుదల చేస్తున్న దేశం చైనా. అక్కడ వాతావరణ కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. ఈ పరిస్థితి పట్ల చైనా ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. అందుకే ప్రజలకు ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో చైనా తన ప్రధాన నగరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగ్ లు ఏర్పాటు చేసింది. ఆ హోర్డింగ్ లలో... భారత్ లోని ముంబయి, అలహాబాద్ వంటి నగరాలు కాలుష్యం కారణంగా ఎలా ప్రభావితమయ్యాయో వివరించేందుకు ప్రయత్నించింది. కాలుష్యం వాతావరణాన్ని ఎలా మార్చివేస్తుందో, దాని కారణంగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలిపేలా ఉన్న ఆ హోర్డింగ్ లు, పోస్టర్లను వాంగ్ ఫుజింగ్ వంటి నగరాల్లో ఏర్పాటు చేసింది. వాటిలో ఓ ప్రకటనలో... ముంబయిలో కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా, అక్కడి టీనేజర్లు ఆడుకునేందుకు తగిన స్థలం లేక పడే ఇబ్బందులను వివరించింది. తన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే స్థాయికి కాలుష్యం పెరిగిపోవడంతో, చైనా, నివారణకు ప్రతినబూనింది.

  • Loading...

More Telugu News