: 14 ఏళ్లలో అక్కడ ఒకే ఒక కేసు...అది కూడా ఫేక్!
భారత దేశంలో దొంగతనాలు నమోదు కాని ప్రాంతం ఏదైనా ఉందంటే అది శని సింగణాపూర్ గ్రామమే అని మనకు తెలుసు. అయితే, అదే కాకుండా మరో గ్రామం కూడా వుందంటే నమ్మశక్యం కాదు. పైగా అరాచకాల ఉత్తరప్రదేశ్ లో అలాంటి గ్రామం ఉందంటే అస్సలు నమ్మశక్యం కాదు. కానీ ఇది నిజం! ఉత్తరప్రదేశ్ లోని ఎటా రైల్వేస్టేషన్ లో గత 14 ఏళ్లలో రెండంటే రెండే కేసులు నమోదయ్యాయి. ఈరెంటిలో ఒకటి ఢిల్లీకి సంబంధించినది. దానిని ఎటా రైల్వే స్టేషన్ అధికారులు ఢిల్లీకి బదిలీ చేశారు. దీంతో ఇక ఒకే కేసు మిగిలింది. ఈ కేసు కూడా ఫేక్ కేస్ లాంటిదే. 2010లో కంప్యూటర్ మౌస్ పోయిందంటూ ఓ రైల్వే కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో తక్షణం స్పందించిన రైల్వే అధికారులు, విచారణ చేయించారు. ఈ విచారణలో అధికారుల తీరు పరీక్షించేందుకు ఆయన కేసు నమోదు చేసినట్టు తేలింది. దీంతో లైట్ తీసుకున్నారు.