: మాజీ స్పీకర్ నేతృత్వంలో టీ.పీసీసీ షాడో కేబినెట్


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షాడో కేబినెట్ ఏర్పాటు చేసింది. అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి చైర్మన్ గా 17 మంది సభ్యులతో కేబినెట్ ఏర్పాటైంది. ఇందులో కాంగ్రెస్ మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. విభజన చట్టంలో హామీలు, టీఆర్ఎస్ మేనిఫెస్టో, ప్రభుత్వ పథకాల అమలు తీరు, కేసీఆర్ ప్రకటనల అమలు అంశంపై ఈ కమిటీ పరిశీలించనుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేంతవరకూ ఒత్తిడి తెస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. పార్టీ ఫిరాయింపులతోనే కేసీఆర్ రాజకీయ కాలుష్యం పెంచుతున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వంపై ఇక నుంచి దూకుడుగా వ్యవహరిస్తామని సురేశ్ రెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News