: జింబాబ్వే పర్యటనకు కరణ్ శర్మ దూరం


టీమిండియా ఆటగాడు కరణ్ శర్మ జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. ఐపీఎల్ సీజన్లలో నిలకడగా రాణిస్తున్న కరణ్ శర్మ, రహానే నేతృత్వంలో జింబాబ్వే పర్యటనకు ఎంపికైన 15 మంది సభ్యుల జట్టులో ఒకడు. అయితే, ప్రాక్టీస్ లో కరణ్ శర్మ ఎడమ చేతికి గాయమైంది. దీంతో పర్యటనకు దూరమయ్యాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు ఆడుతున్న కరణ్ శర్మ, లెగ్ బ్రేక్ బౌలింగ్, రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ గా రైల్వేస్ జట్టుకు సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్నాడు. టీమిండియాకు ఎంపిక కావడంతో ప్రతిభకు తగ్గ అవకాశం దక్కిందని ఆనందించేలోగా గాయం పర్యటనకు దూరం చేసింది.

  • Loading...

More Telugu News