: మా నాన్నపై అన్యాయంగా కేసులు పెట్టారు: భూమా అఖిలప్రియ


తన తండ్రి భూమా నాగిరెడ్డిని అరెస్టు చేయడంపై ఆయన కుమార్తె, వైసీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మండిపడ్డారు. తన తండ్రిని టార్గెట్ చేసి అన్యాయంగా కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ విషయంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని చెప్పారు. కోర్టులో బెయిల్ పిటిషన్ వేశామని రేపు విచారణకు వస్తుందని తెలిపారు. అంతకుముందు పోలీసుల అనుమతితో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని చూసేందుకు అఖిలప్రియ వచ్చారు. మరోవైపు మెరుగైన చికిత్స కోసం భూమాను తిరుపతి స్విమ్స్ లేదా హైదరాబాద్ నిమ్స్ కు తరలించే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు.

  • Loading...

More Telugu News