: హైదరాబాదులో ఎయిర్ ఇండియా ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ దాడి


ఆటో డ్రైవర్ల ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. తాజాగా, హైదరాబాద్ మెహిదీపట్నంలో ఎయిర్ ఇండియా ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విధులు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న ఆమెపై ఆటో డ్రైవర్ దాడి చేసి 7 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లాడు. దీనిపై సదరు బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News