: వారంలోగా క్షమాపణలు చెప్పండి: మల్లికా శెరావత్ కు సుప్రీం ఆదేశం
వారం రోజుల్లోగా లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని బాలీవుడ్ శృంగార తార మల్లికా శెరావత్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాలీవుడ్ సినిమా 'డర్టీ పాలిటిక్స్' పోస్టర్లలో మల్లికా శెరావత్ మువ్వన్నెల జెండాను ఒంటి నిండా చీరలా కప్పుకుని జాతీయపతాకాన్ని అగౌరవపరిచిందని సుప్రీంకోర్టులో న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఇదే కేసులో దేశంలోని పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.