: 'వ్యాపమ్' కుంభకోణంపై సుప్రీంకోర్టులో 'ఆప్' పిటిషన్
మధ్యప్రదేశ్ 'వ్యాపమ్' కుంభకోణంపై సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. దానికి సంబంధించిన కేసుపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాలని అందులో కోరింది. ఈ విషయాన్ని ఆప్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. ఈ కేసులో అనుమానాస్పద మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ఆప్ కోర్టును ఆశ్రయించింది. ఇప్పటివరకు కేసుకు సంబంధించి 48 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసులో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా సుప్రీంలో పిటిషన్ వేయనున్నారని తెలిసింది.