: సఫారీ గడ్డపై ప్రియురాలితో కోహ్లీ షికారు!
భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సఫారీ గడ్డపై షికారు చేస్తున్నాడు. జింబాబ్వే టూర్ నేపథ్యంలో కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. దాంతో, మనవాడు ప్రియురాలు అనుష్క శర్మతో కలిసి దక్షిణాఫ్రికాలో వాలిపోయాడు. అక్కడి ప్రకృతి అందాలను వీక్షిస్తూ, చారిత్రక స్థలాలను సందర్శిస్తూ విశ్రాంతి సమయాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు. తన విదేశీ యాత్ర గురించి కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటో పోస్టు చేశాడు. ఓ స్విమ్మింగ్ పూల్ బయట కాళ్లు చాపుకుని కూర్చుని ఉన్న ఫొటోను పోస్టు చేశాడు. అయితే, ఆ ఫొటోలో అనుష్క శర్మ లేదు. ఆ బాలీవుడ్ నటి కూడా కోహ్లీతో పాటే సఫారీ గడ్డపై ఉందన్న విషయం ఎలా తెలిసిందంటారా? కోహ్లీ, అనుష్క బస చేసిన సబీ సబీ ఎర్త్ లాడ్జ్ లోని ఓ చెఫ్ చేసిన ట్వీట్ తో విషయం వెల్లడైంది. బీసీసీఐ ఇచ్చిన సెలవులను మనవాడు ఈ విధంగా వినియోగించుకుంటున్నట్టుంది.