: 'హరితహారం' కార్యక్రమానికి కేంద్ర మంత్రి జవదేకర్ ప్రశంసలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'హరితహారం' కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశంసించారు. ఇటువంటి కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని కొనియాడారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే పదేళ్లలో రాష్ట్రంలో 33 శాతం మొక్కలు నాటడం సాధ్యమవుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతె గ్రామంలో ఈరోజు నిర్వహించిన హరితహారంలో సీఎం కేసీఆర్, జవదేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ఆయన మొక్క నాటారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన ఉద్యమానికి ప్రజలందరూ మద్దతు పలికారని జవదేకర్ అన్నారు.