: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని నిర్మించనున్న రామోజీరావు... రాష్ట్రపతితో భేటీ


ఈనాడు సంస్థల అధిపతి, మీడియా బ్యారన్ రామోజీరావు ఒక మహా యజ్ఞానికి పూనుకున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఆయన నిర్మించనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని రామోజీరావు నిన్న కలిశారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు కిరణ్, కోడళ్లు శైలజ, విజయలు కూడా రాష్ట్రపతిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా, ప్రణబ్ కు 'ఓం స్పిరిచ్యువల్ సిటీ'కి సంబంధించిన పుస్తకాన్ని రామోజీ బహూకరించారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను రాష్ట్రపతికి వివరించారు. ఇదే సందర్భంలోనే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని నిర్మిస్తున్నట్టు ప్రణబ్ కు రామోజీ తెలిపారు.

  • Loading...

More Telugu News