: మధ్యప్రదేశ్ గవర్నర్ తొలగింపు పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు


మధ్యప్రదేశ్ లోనే కాక దేశవ్యాప్తంగా పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన వ్యాపం కుంభకోణం ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ కుర్చీ కిందకు నీళ్లు తెచ్చేలానే ఉంది. ఈ కుంభకోణం విచారణలో నిక్కచ్చిగా వ్యవహరించిన అధికారులతో పాటు, సాక్షమిచ్చేందుకు ముందుకు వచ్చిన 48 మంది అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. గడచిన మూడు రోజుల్లోనే రోజుకొకరు చొప్పున మరణించారు. నేటి ఉదయం ఎస్సై ఉద్యోగానికి ఎంపికై, సాగర్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ తీసుకుంటున్న యువతి అనామికా కుష్వాహా చెరువులో శవమై తేలారు. దీంతో ఈ కుంభకోణంపై దేశవ్యాప్తంగా కలకలం రేగింది. కేసు విచారణను గాలికొదిలేసిన గవర్నర్ ను గద్దె దించేలా ఉత్తర్వులివ్వాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేగింది.

  • Loading...

More Telugu News