: 2019 నాటికి ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తాం: పురందేశ్వరి


అనంతపురం జిల్లా పెనుకొండలో 40 అడుగుల కృష్ణదేవరాయల విగ్రహాన్ని బీజేపీ నేత పురందేశ్వరి ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెనుకొండ పట్ణాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 2019 నాటికి ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. కేంద్రం సహకరించడం లేదన్నది దుష్ప్రచారమేనని ఆమె కొట్టిపారేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదంతోనే రాష్ట్రానికి 11 కేంద్ర విద్యా సంస్థలు లభించాయని చెప్పారు. కేంద్రం సహకారంతోనే రాష్ట్రానికి 24 గంటల విద్యుత్ అందుతోందని పురందేశ్వరి తెలిపారు.

  • Loading...

More Telugu News