: కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు: వైకాపా


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే నారాయణస్వామి ఆరోపించారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం చంద్రబాబు వైఖరిని స్పష్టం చేస్తోందని అన్నారు. భూమాపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో వైకాపాను పూర్తి స్థాయిలో దెబ్బతీయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఇలాంటివి మొదటి నుంచి అలవాటేనని చెప్పారు. మరోవైపు, మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా భూమాపై అన్యాయంగా కేసులు పెట్టారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News