: పోలీసులు అలా చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే: కేంద్ర సమాచార కమిషన్
శుక్రవారం రాత్రి వేళల్లో వ్యక్తులను పోలీసులు కావాలనే అరెస్ట్ చేస్తున్నారని... ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని కేంద్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. శుక్రవారం రాత్రి అరెస్ట్ చేస్తే సోమవారం వరకు బెయిల్ దొరికే అవకాశం ఉండదని... బెయిల్ దొరక్కుండా ఉండేందుకే పోలీసులు ఇలా చేస్తున్నారని అభిప్రాయపడింది. అలాగే రోజుల తరబడి నిర్బంధంలో ఉంచడం కూడా దారుణమని సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. తీహార్ జైల్లో ఉన్న ఒక ఖైదీ తనను ఎందుకు నిర్బంధించారో తెలుసుకోవాలనుకుంటే పోలీసులు సమాచారం ఇవ్వలేదు. దీంతో, అతను సమాచార హక్కు కమిషన్ ను ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన మాడభూషి శ్రీధర్ పోలీసుల తీరును ఎండగట్టారు.