: ఈ సాయంత్రం 4.30కు పవన్ మీడియా సమావేశం
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడనున్నారు. ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై ప్రశ్నించడం లేదంటూ పలువురు రాజకీయ నేతలు పవన్ ను నిలదీశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే తాను మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడతానని ట్విట్టర్ లో చెప్పిన సంగతి తెలిసిందే.