: ఏసీబీ ముందు విచారణకు హాజరైన ఎమ్మెల్యే సండ్ర


టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో ఉన్న ఏసీబీ కార్యాలయానికి కొద్దిసేపటి కిందటే ఆయన చేరుకున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో సండ్రను అధికారులు ప్రశ్నించనున్నారు. ఆయనతో పాటు జిమ్మీబాబు అనే వ్యక్తిని కూడా ఏసీబీ విచారించనుంది. అయితే ఓటుకు నోటు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సండ్ర అంతకుముందు మీడియాతో అన్నారు. తాను ఏ ఎమ్మెల్యేతోను మాట్లాడలేదని, ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఏసీబీ విచారణకు పిలిచినందునే వెళుతున్నానని, పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News