: సమ్మెలో కాంట్రాక్టు కార్మికులు...తెలంగాణ మునిసిపాలిటీల్లో నిలిచిపోయిన పారిశుద్ధ్య పనులు
డిమాండ్ల సాధన కోసం తెలంగాణ మునిసిపల్ కాంట్రాక్టు కార్మికులు నేటి ఉదయం నుంచి సమ్మెను ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో కాంట్రాక్టు కార్మికుల సమ్మె ప్రారంభమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎక్కడి చెత్త అక్కడే పడిపోయింది. ఇదివరకే కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీసుపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. దీంతోనే సమ్మెకు దిగక తప్పడం లేదని నిన్న కాంట్రాక్టు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. జీహెచ్ఎంసీలోని కాంట్రాక్టు కార్మికులు కూడా సమ్మెలో పాలుపంచుకుంటున్న నేపథ్యంలో హైదరాబాదులో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి.